Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:20 AM

ఎమ్మెల్యే సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం

16-02-2026 268 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా నగేష్ కుమార్ షేట్కార్,వైస్ చైర్ పర్సన్‌గా దారం శంకర్ సెట్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ వేడుక నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో అధికారికంగా జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ మరియు కౌన్సిలర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి ఘనమైన మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నారాయణఖేడ్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన,మౌలిక వసతుల అభివృద్ధి,పారిశుధ్యం,తాగునీరు,రహదారులు,విద్యుత్ వంటి అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి విజయం సాధించిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.గజమాలతో అలంకరించి ఆనందోత్సాహాలతో అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమ హారతి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తదితర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Sthanikam

ఎమ్మెల్యే సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News