Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:29 PM

ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగాల వెంకన్న మాదిగ నియామకం

24-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆదేశానుసారం సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగాల వెంకన్న మాదిగ ను నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు పల్లేటి లక్ష్మణ్ మాదిగ అన్నారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఏర్పడిన రోజు నుండి మేడి పాపన్న మాదిగ నాయకత్వంలో పనిచేసిన వ్యక్తి వంగాల వెంకన్న మాదిగ అని సూచించారు. అంతేకాకుండా ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అనేక సేవలు చేస్తూ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన వ్యక్తి వంగాల వెంకన్న మాదిగ అంటూ లక్ష్మణ్ మాదిగ కొనియాడారు. ఈ సందర్భంగా వంగాల వెంకన్న మాట్లాడుతూ.... నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ , పల్లేటి లక్ష్మణ్ మాదిగ లు ఇంత బాధ్యత అప్ప చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి విషయంలో నా వంతు పాత్ర కచ్చితంగా పోషిస్తానని సూచించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలాలు తిరిగి కమిటీలు వేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని అన్నారు. సూర్యపేట జిల్లాలో మాదిగలకు ఎలాంటి అన్యాయం జరిగిన నేను ముందుండి జిల్లా అధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగ తో సహకరిస్తానని అన్నారు. ప్రభుత్వ పథకాలు మాదిగలకు సక్రమంగా అందే విషయంలో తన వంతు గా ప్రజా ప్రతినిధులను కోరుతానని సూచించారు. అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో మండల స్థాయి నాయకులతో పాటు కలిసిపోయి సక్రమంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకు జానయ్య మాదిగ, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి చింత సైదులు మాదిగ, తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ పాల్వాయి సూరయ్య మాదిగ, జిల్లా నాయకులు మొండి కత్తి లింగయ్య మాదిగ, పాల్వాయి శ్రీనివాస్ మాదిగ ల తోపాటు తదితరులు ఉన్నారు.

Sthanikam

ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగాల వెంకన్న మాదిగ నియామకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News