Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సిపిఎం పార్టీ పోరాట ఫలితమే నేడు రైతులకు భూమి పట్టాలు ;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:08 PM

ఏ పార్టీ అండ లేకుండానే ఘన విజయం

ఏ పార్టీ అండ లేకుండానే ఘన విజయం

ఏ పార్టీ అండ లేకుండానే ఘన విజయం
16-02-2026 331 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జై గౌడ్ కండువాతో ప్రమాణ స్వీకారం చేసిన హుజుర్నగర్ కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ గౌడ్

హుజుర్నగర్ పట్టణంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించిన వల్లపుదాసు కృష్ణ గౌడ్ గారు కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. జై గౌడ్ కండువా ధరించి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక పురపాలక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వల్లపుదాసు కృష్ణ గౌడ్ గారు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గౌడ్ సంఘానికి చెందిన నాయకులు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అభినందనలు తెలిపారు. వల్లపుదాసు కృష్ణ గౌడ్ గారు మాట్లాడుతూ, తనను నమ్మి ఓటు వేసిన పట్టణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి పార్టీ అండ లేకున్నా ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందడం తనకు గర్వకారణమని అన్నారు. ప్రజల సమస్యలే తన రాజకీయ అజెండా అని, ప్రతి వార్డు సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘ నాయకులు, పట్టణ ప్రముఖులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జై గౌడ్ నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.

Sthanikam

ఏ పార్టీ అండ లేకుండానే ఘన విజయం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News