Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించిన నారాయణఖేడ్ బీఆర్ఎస్ నాయకులు

Updated : 29 Nov 2026 17:24 IST
As Preferred Source 1 min read
దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించిన నారాయణఖేడ్ బీఆర్ఎస్ నాయకులు

మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. 'కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..' అనే నినాదంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. ఆయన పట్టుదల, త్యాగం, అలుపెరుగని పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, విట్టల్ రావు పటేల్, మున్సిపల్ కౌన్సిలర్లు అభిషేక్ షెత్కార్, విజయ్ బుజ్జి, మాజీ కౌన్సిలర్ విట్టల్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గోపాల్, సర్పంచ్ గణపతి, మాజీ సర్పంచులు చన్ బసప్ప, జైపాల్ రెడ్డి, రవి నాయక్, సంతోష్ నాయక్, నాయకులు జైపాల్, సర్దార్ నాయక్, చింటూ, నరేష్, బాబు సింగ్, రాములు, వెంకట్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించిన నారాయణఖేడ్ బీఆర్ఎస్ నాయకులు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి