Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

దాబాలో అక్రమ మద్యం లభ్యం: ఆరు బీర్ల సీసాల స్వాధీనం- సీఐ సతీష్ రెడ్డి

Updated : 10 Nov 2026 05:04 IST
As Preferred Source 1 min read
దాబాలో అక్రమ మద్యం లభ్యం: ఆరు బీర్ల సీసాల స్వాధీనం- సీఐ సతీష్ రెడ్డి

అనిల్ దాబాలో పోలీసుల తనిఖీలు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

రెడ్డిబావి గ్రామంలోని జాతీయ రహదారి (ఎన్ ఎచ్ 65) పక్కన ఉన్న అనిల్ దాబాలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో పోలీసులు దాడి చేసి ఆరు బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.​ఈ సంఘటన వివరాలను చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి.సతీష్ రెడ్డి వెల్లడించారు. పెట్రో మొబైల్-1 విధులు నిర్వర్తిస్తున్న హెచ్‌సీ 1843 వి.శ్రీనివాస్ కు అందిన సమాచారం మేరకు సోమవారం అనిల్ దాబాలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 06 'బడ్‌వైజర్' బీర్ బాటిళ్లు లభించాయి.

​అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని విచారించగా, అతడు రెడ్డిబావి గ్రామానికి చెందిన కన్నయ్య కుమార్ (26), తండ్రి: అనిల్ కుమార్ (వ్యాపారం) అని తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సతీష్ రెడ్డి తెలిపారు.

Sthanikam

దాబాలో అక్రమ మద్యం లభ్యం: ఆరు బీర్ల సీసాల స్వాధీనం- సీఐ సతీష్ రెడ్డి

Article Image

అనిల్ దాబాలో పోలీసుల తనిఖీలు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

రెడ్డిబావి గ్రామంలోని జాతీయ రహదారి (ఎన్ ఎచ్ 65) పక్కన ఉన్న అనిల్ దాబాలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో పోలీసులు దాడి చేసి ఆరు బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.​ఈ సంఘటన వివరాలను చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి.సతీష్ రెడ్డి వెల్లడించారు. పెట్రో మొబైల్-1 విధులు నిర్వర్తిస్తున్న హెచ్‌సీ 1843 వి.శ్రీనివాస్ కు అందిన సమాచారం మేరకు సోమవారం అనిల్ దాబాలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 06 'బడ్‌వైజర్' బీర్ బాటిళ్లు లభించాయి.

​అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని విచారించగా, అతడు రెడ్డిబావి గ్రామానికి చెందిన కన్నయ్య కుమార్ (26), తండ్రి: అనిల్ కుమార్ (వ్యాపారం) అని తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సతీష్ రెడ్డి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి