చౌటుప్పల్ రామ్ నగర్లో అభ్యుదయ యూత్ నూతన కమిటీని శనివారం ఘనంగా ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులు చెరుకు అశోక్ గౌడ్, వర్కాల వెంకట్ కుమార్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు తోర్పునూరి బాబుగౌడ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు.అధ్యక్షుడు చెవగొని వెంకటేష్ గౌడ్,ఉపాధ్యక్షుడు మార్గం నరసింహ యాదవ్, ప్రధాన కార్యదర్శి తోర్పునూరి లింగస్వామి గౌడ్, కోశాధికారి వెంకటేష్ గౌడ్, కార్యదర్శి తోర్పునూరి చిన్న మల్లేష్ గౌడ్, కార్యనిర్వహణ కార్యదర్శి వర్కాల జయరాం గౌడ్, సలహా కార్యదర్శి చెవగొని రమేష్ గౌడ్,ప్రచార కార్యదర్శి చెరుకు రాము గౌడ్,సాంస్కృతిక కార్యదర్శి తోర్పునూరి సాయిలు గౌడ్, బాలగోని రాంప్రసాద్ గౌడ్,కార్యవర్గ సభ్యులు తోర్పునూరి వెంకటేష్ గౌడ్, బెదరకోట వెంకటేష్, ఉష్కాకుల శ్రీశైలం గౌడ్, బందారం శివగౌడ్, చెరుకు సాయి గౌడ్, మొగుదాల రమేష్ గౌడ్, ఊదరి రాకేష్.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చెవగొని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. కమిటీ ఎన్నికకు సహకరించిన పెద్దలకు, కాలనీ వాసులకు, సీనియర్ యూత్ సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోర్పునూరి పెద్ద మల్లేష్ గౌడ్, బాలగోని నరసింహ గౌడ్, తోర్పునూరి జంగయ్య గౌడ్, విశ్వరూపం చారి, చెవగొని మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్లో అభ్యుదయ యూత్ నూతన కార్యవర్గం ఎన్నిక.. అధ్యక్షుడిగా చెవగొని వెంకటేష్ గౌడ్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి