రామన్నపేట: చట్టం తన పని తాను చేసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు తగదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరోద్దీన్ అన్నారు. పల్లివాడలో జరిగిన దాడి ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం పోలీసుల బాధ్యత అని స్పష్టం చేశారు.
పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్, ఆయన అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయని జమీరోద్దీన్ ఆరోపించారు. ఘటనలోని వాస్తవాలను పక్కనపెట్టి తమ వారిపైనే దాడి జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే నిరసనకు దిగడం సరికాదన్నారు.
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడకుండా ప్రజాపాలనకు ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటే రమేష్, మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్, నాయకులు వనం చంద్రశేఖర్, జెల్ల వెంకటేష్, కోట సుధాకర్, మోటే మహేష్, కేసుదాస్ వెంకటేష్, నకరికంటి సుదర్శన్, పల్లివాడ గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల మల్లయ్య, తుర్కపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు జూలకంటి వెంకటేష్, తుర్కపల్లి సర్పంచ్ సల్ల పిచ్చిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కన్నబోయిన మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి