Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

బదిలీ అయినా మాట తప్పని కలెక్టర్ హనుమంతరావు

26-02-2026 192 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భరత్ చంద్రాచారి కుటుంబానికి ఇందిరమ్మ ఇంటి భూమిపూజ

యాదాద్రి భువనగిరి, : బదిలీ అయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని మరోసారి నిరూపించారు హనుమంతరావు. జిల్లా పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాలగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రాచారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున మంజూరైన ఇందిరమ్మ ఇంటికి ఆయన స్వయంగా భూమిపూజ చేశారు.

గతంలో భరత్ చంద్రాచారిని దత్తత తీసుకున్న కలెక్టర్ ప్రతి నెల అతని విద్య కోసం రూ.5,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబానికి అవసరమైన నెలవారీ సరుకులను కూడా అందిస్తున్నారు. నివాసానికి సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని తెలుసుకున్న ఆయన ప్రభుత్వం ద్వారా 225 గజాల ఇంటి స్థలం మంజూరు చేయించి, ఇందిరమ్మ గృహ నిర్మాణానికి నేడు శుభారంభం చేశారు.

ఈ సందర్భంగా భరత్‌కు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనకు బదిలీ జరిగినప్పటికీ ఏ సమస్య వచ్చినా నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. గృహ నిర్మాణ పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ, ఉప పోలీస్ అధికారి, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

బదిలీ అయినా మాట తప్పని కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News