Sthanikam - Truth Matters
Logo

అత్యాధునిక TACE చికిత్సతో లివర్ క్యాన్సర్‌కు చెక్

Updated : 29 Apr 2026 15:56 IST
As Preferred Source 1 min read
అత్యాధునిక TACE చికిత్సతో లివర్ క్యాన్సర్‌కు చెక్

నల్లగొండ/హైదరాబాద్:

లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ వృద్ధుడికి అత్యాధునిక వైద్య సాంకేతికతతో కొత్త జీవితం లభించింది. మలక్‌పేట్‌లోని యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ట్రాన్స్ ఆర్టీరియల్ కీమోఎంబోలైజేషన్ (TACE) అనే మినిమల్ ఇన్వేసివ్ విధానంతో విజయవంతంగా చికిత్స అందించారు.

హెపటోసెల్యులార్ కార్సినోమా (HCC)గా పిలిచే లివర్ క్యాన్సర్ సాధారణంగా ప్రారంభ దశల్లో లక్షణాలు చూపించకపోవడంతో ఆలస్యంగా గుర్తించే ప్రమాదం ఉంది. బరువు తగ్గడం, ఆకలి మందగించడం, అలసట, కడుపు నొప్పి, పసుపు వంటి లక్షణాలు కనిపించే సమయానికి వ్యాధి ముందడుగు వేసి ఉండే అవకాశం ఉంది. అందువల్ల హై రిస్క్ వ్యక్తులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ కేసులో 60 ఏళ్ల రోగి క్రానిక్ లివర్ డిసీజ్, టైప్–2 డయాబెటిస్, రక్తపోటు సమస్యలతో ఆసుపత్రికి చేరగా, వైద్యులు సమగ్రంగా పరిశీలించి TACE విధానాన్ని అమలు చేశారు. ట్యూమర్‌కు రక్తాన్ని అందించే నాళాలను ఖచ్చితంగా గుర్తించి, నేరుగా కీమోథెరపీ మందును పంపిస్తూ రక్తప్రసరణను అడ్డుకోవడం ద్వారా ట్యూమర్‌ను నియంత్రించారు. ఈ ప్రక్రియ వల్ల ఆరోగ్యకరమైన లివర్ కణజాలానికి నష్టం లేకుండా చికిత్స అందించడం సాధ్యమైంది.

డా. రోహిత్ రెడ్డి పర్యవేక్షణలో, డా. సంకేత్ కులకర్ణి నేతృత్వంలో నిర్వహించిన ఈ చికిత్స విజయవంతమైంది. రోగి ఆరోగ్యం స్థిరపడటంతో పాటు లక్షణాల్లో మెరుగుదల కనిపించగా, ఎలాంటి క్లిష్టతలు లేకుండా డిశ్చార్జ్ చేశారు.

Sthanikam

అత్యాధునిక TACE చికిత్సతో లివర్ క్యాన్సర్‌కు చెక్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి