జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అరుంధతి నగర్ లో గత 6 నెలలుగా తీవ్ర నీటి సమస్య నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు రోజులకోసారి వచ్చే తాగునీరు ఇప్పుడు నాలుగు రోజులకోసారి వస్తుందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.దీంతో ప్రజలు తాగునీటి కోసం,బోర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు. వేసవి వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే నీటి సరఫరాను గతంలోలాగా రెండు రోజులకోసారి పునరుద్ధరించాలని,అవసరమైన కాలనీలకు కొత్త పైప్ లైన్ వేసి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతూ జవహర్ నగర్ వాటర్ బోర్డ్ ఏ. ఈ కి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో కె. వికాస్, విహార్ కుమార్, ఎం.డి. సాజిద్, అమీనా, ఏ. జోర్డ్, పవిత్ర, సాయి కృష్ణ తదితరులు ఉన్నారు.
అరుంధతి నగర్ లో తాగునీటి కష్టాలు*
అరుంధతి నగర్ లో తాగునీటి కష్టాలు*
Prabhakar

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి