Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

అంగరంగ వైభవంగా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

17-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-దేవస్థానం కార్యనిర్వహణ అధికారి భవానిశంకర్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి భవాని శంకర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల ఫిబ్రవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలలో స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి పెద్ద ఎత్తున ప్రచార నిర్వహిస్తున్నామని అన్నారు. కరపత్రాలు పోస్టర్లు ఆర్చీల ద్వారా ఇతర ప్రకటన ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచార నిర్వహిస్తున్నామని తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన స్వామివారి ఎదుర్కొల్లు ఈనెల 24వ తేదీన జరగనున్నాయని తెలిపారు. అదే విధంగా 25వ తేదీన స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 26వ తేదీన స్వామివారి దివ్య విమాన రథోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన స్వామివారి కల్యాణ మహోత్సవం స్వామి వారి రథోత్సవ కార్యక్రమాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే విఐపి లు, వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వీఐపీలతో పాటు సామాన్య భక్తులకు స్థానికులకు స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు స్వామివారి పులిహోర లడ్డు ప్రసాదాలను సరిపోయే విధంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాటల్లో భాగంగా పారిశుధ్యం ఇతరత్న అన్ని కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. లైటింగ్ సౌండ్ సిస్టంను ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ పరిసరాలలో పెద్ద ఎత్తున ఎల్ఈడి స్పీడ్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దూరంగా ఉండే భక్తులు సైతం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని దగ్గరగా వీక్షించేందుకు ఎల్ఈడి స్పీడ్ లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు, స్థానికులు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వంశపారంపర్య ధర్మకర్త భాస్కరరాయణి నరసింహమూర్తి, డిఇఓ దోర్భలభాస్కర్ శర్మ, ఏఈఓ రఘు బాబు, ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, బట్టర్ సురేంద్ర చార్యులుతో పాటు ఆలయ అధికారులు, అర్చకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

అంగరంగ వైభవంగా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News