Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:43 AM

అంగన్వాడీ టాయిలెట్ల నిర్మాణంలో నాణ్యత లోపాలు… కాలనీ వాసుల ఆగ్రహం

21-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ 11వ వార్డ్‌లో చిన్నపిల్లలు ఉండే అంగన్వాడీ సమీపంలో నిర్మాణంలో ఉన్న టాయిలెట్ల పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం బయటపడుతోంది. సుమారు మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ నిర్మాణ పనుల్లో ప్రాథమిక నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం, టాయిలెట్ నిర్మాణానికి వేసిన బేస్మెంట్‌కు ఇప్పటివరకు కనీసం ఒక్క బకెట్ నీరు కూడా పోయలేదని చెబుతున్నారు. నిర్మాణంలో అత్యంత కీలకమైన దశ అయిన బేస్మెంట్ కట్టిన తర్వాత సరైన కరువు (curing) చేయకపోవడం వల్ల భవనం బలహీనంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే గోడల నిర్మాణం ప్రారంభించినప్పటికీ, సిమెంట్ మిశ్రమం కూడా సరైన ప్రమాణాల్లో కలపడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల నిర్మాణం పూర్తయిన తర్వాత అది ఎంతకాలం నిలబడుతుందనే అనుమానాలువ్యక్తమవుతున్నాయి.చిన్నపిల్లలు ఉపయోగించే అంగన్వాడీకి సంబంధించిన టాయిలెట్లు కావడంతో మరింత జాగ్రత్తగా నిర్మాణం చేయాలి. కానీ ఇక్కడ మాత్రం పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది,” అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పనులను తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

అంగన్వాడీ టాయిలెట్ల నిర్మాణంలో నాణ్యత లోపాలు… కాలనీ వాసుల ఆగ్రహం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News