1952లో తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తూ వస్తున్న 102 ఏళ్ల సీనియర్ నాయకుడు కజ్జాడి రాంగోండాను జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ఘనంగా సన్మానించారు. నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎంపీ స్వగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శంకరయ్యస్వామి, సీనియర్ నాయకుడు తాహిర్ అలీ కలిసి రాంగోండాను శాలువాతో సత్కరించి అభినందించారు. దివంగత అప్పారావు షెట్కర్ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న రాంగోండా సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేసుకున్నారు. ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ మాట్లాడుతూ, 1952 నుంచి నేటి వరకు పార్టీతో అనుబంధాన్ని కొనసాగించడం, ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరంతరం పాల్గొనడం అభినందనీయమని అన్నారు. కజ్జాడి రాంగోండా వంటి సీనియర్ నాయకుల అనుభవాలు, జ్ఞాపకాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, వారి సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. శంకరయ్యస్వామి, తాహిర్ అలీ మాట్లాడుతూ, పాత తరం నాయకుల అనుభవాలు, సేవలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు రాంగోండాతో ఆత్మీయంగా మాట్లాడి ఆయన అనుభవాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నగేష్తో పాటు పలువురు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
1952 నుంచి కాంగ్రెస్కు ఓటు వేస్తున్న 102 ఏళ్ల కజ్జాడి రాంగోండాకు ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఘన సన్మానం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి