భువనగిరి: రాయగిరిలోని యూనిటీ పీజీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ డేను నిర్వహించారు. యూనిటీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ ఏ.ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్లు సోమచందు, పి.గోవర్ధన్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఎం.ఎస్.సరిత, డాక్టర్ అంబటి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. 17 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఎంబీఏతో ఉద్యోగ, పారిశ్రామిక అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని సూచించారు.
కార్యక్రమంలో ఏవో పి.సునీత, హెచ్‌ఓడీ జి.సురేష్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి