Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కిసాన్ మేళాకు రైతులు భారీగా తరలిరావాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 05:41 PM

యోగ కేంద్రానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి

07-10-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ఋషి సంస్కృతి యోగ సేవా కేంద్రం నిత్య సాధన యోగ ధ్యాన మందిరానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ నిత్య యోగ ధ్యాన సాధకులు చిట్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పందిరి గీత రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రాలు అందజేశారు. కమిటీ అధ్యక్షుడు మాస శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సాధకులు ఈ వినతిపత్రాలను సమర్పించారు.

యోగ కేంద్రం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని, విద్యుత్‌ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, కేంద్రం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. సాధకులకు ప్రస్తుతం ఉన్న హాల్‌ సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నందున భవన విస్తరణకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ పందిరి గీత రమేష్‌ మాట్లాడుతూ యోగ సాధకుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్డు, ప్రహరీ గోడ, విద్యుత్‌ స్తంభాలు, భవన విస్తరణకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. వీలైనంత త్వరగా, ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బూరుగు కృష్ణయ్య, ముఖ్య సలహాదారులు నారబోయిన శ్రీనివాస్‌, కంచర్ల ఈశ్వరయ్య, నీల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య, గాదె ఎల్లేష్‌, కార్యదర్శులు దాడి అరుణ, కోనేటి సాయిరాం, సభ్యులు చెల్లెటి రవీంద్రనాథ్‌, కుంకుడాల లక్ష్మి, పాలాది రమేష్‌, పోలా సరోజ, మాస స్వరూప, కాచం శాంతిప్రియ, సిలివేర్‌ శేఖర్‌, మందాడి మధుసూదన్‌రెడ్డి, కంది మోహన్‌రెడ్డి, మారగోని రమేష్‌, పులగం శ్రీనివాస్‌రెడ్డి, చికిలమెట్ల అశోక్‌, పాల రమేష్‌, దాసరి బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యోగ కేంద్రానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News