Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:43 AM

యాదాద్రి కలెక్టర్‌కు అడిషనల్ సెక్రటరీ హోదా

24-12-2025 5,963 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలెక్టర్ హనుమంతు రావుకు అడిషనల్ సెక్రటరీ హోదా

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలక పరిణామంగా 2013 బ్యాచ్‌కు చెందిన 11 మంది ఐఏఎస్ అధికారులకు అడిషనల్ సెక్రటరీ హోదాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సర్కులర్ విడుదల చేసింది. ఈ జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు ఉండటం జిల్లాకు గర్వకారణంగా మారింది.

ఈ సందర్భంగా జిల్లా సామాజిక నాయకులు కొడారి వెంకటేష్, బర్రె సుదర్శన్ మాట్లాడుతూ— పరిపాలనా నైపుణ్యం, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో కలెక్టర్ జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. అడిషనల్ సెక్రటరీ హోదాతో జిల్లాకు మరింత ప్రాధాన్యం లభించి, అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఘనతను పురస్కరించుకుని బుధవారం జిల్లా సామాజిక కార్యకర్తలు కలెక్టర్ హనుమంతు రావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కొడారి వెంకటేష్, బర్రె సుదర్శన్, బుద్దుల సునీత, నల్ల కృష్ణ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

యాదాద్రి కలెక్టర్‌కు అడిషనల్ సెక్రటరీ హోదా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News