Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేకులు వద్దు.. చెట్లు ముద్దు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 09:29 AM

వివోఏ (VOA) పై కులం పేరుతో దూషణ, దాడి: నిందితుడిని కఠినంగా శిక్షించాలి - సిఐటియు డిమాండ్

05-10-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

- నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పికె మల్లేపల్లిలో ఘటన- మాజీ సర్పంచ్ భర్త కుప్పల అమర్నాథ్ పై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి- సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, ఎండి సలీం ప్రకటన

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పికె మల్లేపల్లిలో ఐకెపి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వివోఏ)గా పనిచేస్తున్న గనిపెళ్లి మాధవిపై గ్రామ సభలో బహిరంగంగా కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ఆదివారం సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండి సలీం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పికె మల్లేపల్లి గ్రామంలో వివోఏగా పనిచేస్తున్న గనిపెళ్లి మాధవిని మాజీ సర్పంచ్ భర్త కుప్పల అమర్నాథ్... గ్రామస్తులందరి సమక్షంలో కులం పేరుతో దూషించడమే కాకుండా, భౌతిక దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని ఖండించారు. ఒక బాధ్యతాయంతమైన పదవిలో ఉంటూ, చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి ఇలాంటి అరాచక చర్యలకు పాల్పడటం సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతుందని అన్నారు.

గత కొంతకాలంగా సంఘం బంధం రుణాలు చెల్లించాలని అడిగినందుకు, కొంతమంది వ్యక్తులు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారని సిఐటియు నాయకులు ఆరోపించారు. ఇందులో భాగంగానే వివోఏ మాధవిని టార్గెట్ చేసి అన్యాయంగా అధికారులకు ఫిర్యాదులు చేయడం, ఆమె పేరును ఆన్‌లైన్ నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ వ్యవహారంపై కోర్టు తీర్పు వచ్చినప్పటికీ, ఆమెను తిరిగి విధుల్లోకి చేర్చుకోకుండా గ్రామ సభలో న్యాయం చేయాలని అడుగుతున్న మహిళా ఉద్యోగినిపై దాడి చేయడం సరికాదని మండిపడ్డారు.

కావున, వివోఏ గనిపెళ్లి మాధవి పై దాడి చేసిన మాజీ సర్పంచ్ భర్త కుప్పల అమర్నాథ్ పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి పోలీసులు నిందితుడిని అరెస్టు చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో, బాధితురాలికి న్యాయం జరిగే వరకు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఆందోళనలకు దిగుతామని వారు హెచ్చరించారు. మహిళా ఉద్యోగులకు పని ప్రదేశాలలో భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు అధికారులపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వివోఏ (VOA) పై కులం పేరుతో దూషణ, దాడి: నిందితుడిని కఠినంగా శిక్షించాలి - సిఐటియు డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News