Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సేవలోనే స్మరణ.. మల్లేశం గౌడ్ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 07:23 PM

వినియోగదారులకు నిరంతరం అందుబాటులో గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ ఫోరం: సాయిబాబా

07-10-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యుత్‌ సమస్యలపై ఫోరంకు ఫిర్యాదు చేయొచ్చు

భువనగిరి: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఎలక్ట్రిసిటీ కంజ్యూమర్‌ గ్రీవెన్సెస్‌ రెడ్రెసల్‌ ఫోరం నిరంతరం అందుబాటులో ఉంటుందని సీజీఆర్‌ఎఫ్‌ చైర్‌పర్సన్‌ కే. సాయిబాబా తెలిపారు. బుధవారం భువనగిరి కిసాన్‌నగర్‌లోని విద్యుత్‌ కార్యాలయంలో నిర్వహించిన ‘విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక’లో ఆయన మాట్లాడారు.

విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, మీటర్ల సమస్యలు, బిల్లుల వివాదాలు, కొత్త సర్వీసులు, మీటర్‌ పేరుమార్పు, కేటగిరీ మార్పు, ట్రాన్స్‌ఫార్మర్‌ సమస్యలపై ఫోరంకు వ్రాతపూర్వకంగా లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించుకునేందుకు వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని వినియోగదారుల సంఘాల ప్రతినిధి కొడారి వెంకటేష్‌ కోరారు. లోఓల్టేజీ, ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె ఏర్పాటు, రైతులకు సక్రమ విద్యుత్‌ సరఫరా, గృహజ్యోతి పథకం అమలు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫోరం సభ్యులకు వినతిపత్రం అందజేశారు. విద్యుత్‌ తీగల కింద మొక్కలు నాటకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఫోరం సభ్యులు వి. రమణమూర్తి, కే. శోభారాణి, టి. కోటేశ్వరరావు, వివిధ డివిజన్ల ఇంజనీర్లు రవీందర్‌, వెంకటేశ్వర్లు, సుధీర్‌కుమార్‌, పద్మ, శ్రీకాంత్‌, బాలూనాయక్‌, ఫీర్యా, మోహన్‌, పట్టణ ఏఈ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వినియోగదారులకు నిరంతరం అందుబాటులో గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ ఫోరం: సాయిబాబా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News