Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బర్రెల దొంగల భరతం పట్టిన 'చౌటుప్పల్' పోలీసులు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 10:54 PM

వికలాంగుల ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలు చేయాలి

06-10-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రేటర్‌లో అన్ని ఆర్టీసీ బస్సుల్లో పాసులు అనుమతించాలని డిమాండ్‌.

అక్టోబర్‌ 8న బస్సు భవన్‌ ఎదుట ధర్నా

రామన్నపేట, అక్టోబర్‌ 7: వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నడిచే అన్ని రకాల బస్సుల్లో వికలాంగుల పాసులను అనుమతించాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్‌ 8న హైదరాబాద్‌లోని బస్సు భవన్‌ ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టనున్న ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను వనం ఉపేందర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 34 నెలలు పూర్తవుతున్నా హామీ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. మహిళా వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చినప్పటికీ, పురుష వికలాంగులకు కూడా ఈ సదుపాయం కల్పించాల్సి ఉందన్నారు.

జిల్లా స్థాయిలో డీలక్స్‌ బస్సుల్లో వికలాంగుల రాయితీ పాసులను అనుమతిస్తున్నారని, అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నడిచే ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో పాసులను అనుమతించడం లేదన్నారు. గ్రేటర్‌ పరిధిలో ఆర్డినరీ బస్సులు తక్కువ సంఖ్యలో నడుస్తున్నందున వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రేటర్‌లో నడిచే అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో వికలాంగుల పాసులను అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు కోసం 34 నెలలుగా వికలాంగులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో వికలాంగుల పాసులను అనుమతించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం అక్టోబర్‌ 8న బస్సు భవన్‌ ఎదుట నిర్వహించే ధర్నాకు వికలాంగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

నూతన కమిటీ ఎన్నిక

అనంతరం ఇంద్రపాలనగర గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నాగు నరసింహ, అధ్యక్షుడిగా ఒంపు వెంకటేశం, ఉపాధ్యక్షులుగా నూకల వెంకటేశం, ఆది నారాయణ, ప్రధాన కార్యదర్శిగా పెండల శేఖర్‌, సహాయ కార్యదర్శిగా గర్దాస్‌ రవి, మరో సహాయ కార్యదర్శిగా పగడాల లక్ష్మి, కోశాధికారిగా గోకికారి నర్సోజిని ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా శివగల రాములు, గర్దాసు నరహరి, రాచకొండ శ్రీకాంత్‌, పగడాల వెంకటేశం తదితరులు ఎన్నికయ్యారు.

Sthanikam

వికలాంగుల ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News