వెలిమినేడు:
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శనివారం వెలిమినేడు గ్రామపంచాయతీ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి మరియు ఉప సర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్య గౌడ్ గారి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో వి బి జి రామ్ జి ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామపంచాయతీ అభివృద్ధికి చేపట్టాల్సిన వివిధ పనులపై చర్చించారు. ఉపాధి హామీ కింద గ్రామంలో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చో ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నోముల రామకుమార్, నోముల చిరంజీవి, జనగాం మంగమ్మ సత్యనారాయణ, ఆరూరి సునీత రవి, జిలకర నాగమణి జంగయ్య, ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, మరియు పంచాయతీ సెక్రెటరీ తాటికొండ లింగస్వామి పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, చర్చల్లో భాగస్వామ్యమై ఈ గ్రామ సభను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి