రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
దళారులను నమ్మి మోసపోవద్దు
ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, జిల్లా సహకార అధికారి నాగార్జున
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మందోళ్లగూడెం, ఎస్. లింగోటం, నెలపట్ల, అంకిరెడ్డిగూడెం, నక్కలగూడెం తదితర గ్రామాల ధాన్యం కొనుగోలు కొరకు ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, జిల్లా సహకార అధికారి నాగార్జున, పీఏసీఎస్ చైర్మన్ మస్తాన్ బాబు యాదవ్ లతో కలిసి అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... రైతులు తాము తీసుకొచ్చే ధాన్యంలో పొల్లు, రాళ్లు, తడి లేకుండా చూసుకోవాలని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని, మధ్యవర్తులు, దళారులను నమ్మి తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ (కో-ఓ పి ఏ.ఆర్.) కె. సురేష్, ఎం ఎ ఓ ముత్యాల నాగరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పిఎసిఎస్ వైస్ ఛైర్మెన్ పర్నె శివారెడ్డి, డైరెక్టర్లు, స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, ఏఎంసీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు, రైతు నాయకులు, సొసైటీ సీఈఓ (కార్యదర్శి), ఇతర సిబ్బంది, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి