Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే

Updated : 26 Oct 2026 18:47 IST
As Preferred Source 1 min read
మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా మానూర్ మండలం బోరంచ గ్రామంలోని పంప్‌హౌస్ వద్ద మిషన్ భగీరథ విభాగానికి చెందిన 3.95 ఎంఎల్‌డీ సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రాన్ని రూ.95 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో పునరుద్ధరించగా,నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి లభ్యతపై ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నీటి శుద్ధి కేంద్రం అందుబాటులోకి రావడంతో నారాయణఖేడ్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు, ముఖ్యంగా మానూర్ మండల ప్రజలకు తాగునీటి సరఫరాలో మరింత భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు.బోరంచ గ్రామ అభివృద్ధిపై మాట్లాడుతూ, శ్రీ నల్లపోచమ్మ ఆలయం సమీపంలోని నదీ తీరంలో రూ.2 కోట్లతో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల ఆలయానికి వచ్చే భక్తులు, సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయించామని, త్వరలోనే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. తాగునీరు, విద్యుత్ వంటి అత్యవసర సదుపాయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజి రెడ్డి, యువ నాయకుడు లోకేష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బీరప్ప కురుమ, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, దిగంబర్ రెడ్డి, బ్రహ్మానంద్ రెడ్డి, మాజీ సర్పంచులు, సంజీవ్, నవీన్ రెడ్డి, మల్లప్ప, నరసింహ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ ,సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు, స్మార్ట్ రేషన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news