రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.
రామన్నపేట, అక్టోబర్ 26 (స్థానిక ప్రతినిధి):
రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల తహసీల్దార్ లాల్ బహుదూర్, ఎంపీడీవో ఆవుల రాములు, ఏపీఎం జానీ,సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బుక్షం రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్, నాయకులు జినుకల ప్రభాకర్, గుత్తా నరసింహారెడ్డి,వనం చంద్రశేఖర్, రాయిని రమేష్,బొడ్డు సాలయ్య, గోదాసు శ్రీమన్నారాయణ,బత్తుల కృష్ణ, జల్ల వెంకటేశం,కందిమల్ల గోపాల్ రెడ్డి, కొమ్ము శేఖర్,నారపాక యాదయ్య,కొండ బుచ్చిబాబు గౌడ్ ,సాల్వేర్ అశోక్, ఎండి జమురుద్దీన్, ఎండి అక్రమ్, పెద్దగోని వెంకటేశం, అయ్యాడపు నర్సిరెడ్డి, శంబాల వెంకటేశం, కోట సుధాకర్, ఎర్ర శేఖర్, మోటే రమేష్, నారపాక అశోక్,కేశ కిరణ్,అబ్దుల్ వహీద్ అంజాద్, ఎటేల్లి పరమేష్, నోముల ప్రవీణ్, లేంకల ప్రవీణ్ వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. .
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి