సంగారెడ్డి జిల్లాలో పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సోమవారం (అక్టోబర్ 26) సంగారెడ్డిలోని శాంతినగర్ సెయింట్ ఆంథోనీ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు జరిగాయి. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, పోలీసుల విధులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు.పోలీసు అధికారులకు ప్రజల మన్ననలు పొందేందుకు చేయాల్సిన కృషి, కింది స్థాయి పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించగా, పోలీసు సిబ్బందికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుంచి ఆశించే సేవలు, పోలీసుల జీవితాల్లో సామాజిక మాధ్యమాల పాత్ర, వాటిని వ్యక్తిగతంగా, సామాజికంగా ఉపయోగకరంగా ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 34 మంది పాల్గొన్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్, తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడు వ్యాసాలను ఎంపిక చేసి విజేతలకు రివార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు.అదేవిధంగా విద్యార్థినీ, విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర, తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో విద్యార్థుల బాధ్యత, సైబర్ నేరాల నివారణలో పోలీసులు, ప్రజల పాత్ర, విద్యార్థులు మాదకద్రవ్యాలకు ఎలా దూరంగా ఉండాలనే అంశాలపై వ్యాసాలు రాయించారు. విద్యార్థులు, పోలీసు సిబ్బందిలో సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు ప్రజలకు పోలీసు వ్యవస్థపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. పోటీల్లో వచ్చిన వ్యాసాలను పరిశీలించి ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి విజేతలకు రివార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల్లో వ్యాసరచన పోటీలు.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి