ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఎంపిక
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పద్మశాలీ సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన ‘శ్రీ భక్త మార్కండేయ పద్మశాలీయ నిత్యాన్నసత్రం’ ధర్మకర్తల సంఘ సభ్యునిగా చౌటుప్పల్‌కు చెందిన బడుగు బాలరాజు ఎంపికయ్యారు. ఈ మేరకు అయోధ్య అన్నసత్ర నిర్మాణ ధర్మకర్తగా ఆయనను నియమిస్తూ కమిటీ బాధ్యతలు అప్పగించింది.గత కొన్ని దశాబ్దాలుగా హిందూ సనాతన ధర్మం, ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక వికాసానికి బాలరాజు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలను కేటాయించారు. అఖిల భారత పద్మశాలీయ నిత్యాన్నసత్రముల మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్, అయోధ్య అన్నసత్ర అధ్యక్షులు భూరం శంకర్, కార్యదర్శి గజం గురునాథంల సూచనల మేరకు ఈ ఎంపిక జరిగింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన పద్మశాలీయ ప్రముఖులకు బాలరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీరామచంద్రుని దివ్యక్షేత్రమైన అయోధ్యకు వచ్చే భక్తుల కోసం అన్ని రకాల వసతులు, ఉచిత భోజన సౌకర్యాలతో ఈ నిత్యాన్నసత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పద్మశాలీ సోదరుల సహకారంతో అన్నసత్ర నిర్మాణానికి తనవంతు పూర్తి తోడ్పాటు అందిస్తానని వెల్లడించారు. బాలరాజు ఎంపిక పట్ల పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, స్థానిక ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి