రామన్నపేటలో బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు.
రామన్నపేట, అక్టోబర్ 26 (స్థానికం ప్రతినిధి):
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విమర్శించే స్థాయి రామన్నపేట మండల కాంగ్రెస్ నాయకులకు లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నాయకులు కనీస అవగాహన, సంస్కారం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. తమ నాయకుల మెప్పు పొందేందుకే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చిరుమర్తి లింగయ్యను విమర్శించే ముందు కాంగ్రెస్ నాయకులు తమ స్థాయిని తెలుసుకోవాలని సూచించారు. ఇకపై బీఆర్ఎస్ పార్టీని, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నీల దయాకర్ మాజీ మండలాధ్యక్షుడు పోషబోయిన మల్లేశం మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, బోగారం సర్పంచ్ కూనూరిసాయికుమార్ మాజీ ఎంపీటీసీలు సర్పంచులు వేమవరం సుధీర్, నాయకులు అంతటి రమేష్, ఇడెం శ్రీనివాస్, పులిపలుపుల వీరస్వామి,బాబు దోమల సతీష్, పున్న వెంకటేశం,బద్దుల రమేష్, ఎండి ఆమీర్, బందల యాదయ్య కన్నెబోయిన బలరాం, బత్తుల వెంకన్న ఎడ్ల కృష్ణారెడ్డి బండ శ్రీనివాస్ రెడ్డి ఆమనగంటి నరసింహ జెట్టి శివప్రసాద్ గంగుల రాఘవరెడ్డి అనంత చారి మహేష్ వెంకటేశం బొడ్డుపల్లి రాజు కోనూరు లింగస్వామి లక్ష్మయ్య బొడ్డు మల్లయ్య క్రాంతి కుమార్ మామిళ్ళ కుమార్ ఎండి అజాజ్ రాస వెంకటేశ్వర్లు బిక్షం రాజిరెడ్డి నర్రా విజయ్ దండిగా నాగరాజు నాంపల్లి లింగయ్య శ్రీకాంత్ వెంకన్న అంజయ్య సత్తయ్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి