Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ప్రైవేట్ ఉపాధ్యాయులు పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవాలి.శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత డా. మిర్యాల దుర్గాప్రసాద్.

Updated : 26 Oct 2026 20:04 IST
As Preferred Source 1 min read
ప్రైవేట్ ఉపాధ్యాయులు పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవాలి.శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత డా. మిర్యాల దుర్గాప్రసాద్.

వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల కరస్పాండెంట్, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) జిల్లా నాయకులు డా. మిర్యాల దుర్గాప్రసాద్ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ విద్యా వ్యవస్థలో ప్రైవేట్ విద్యారంగం కీలక పాత్ర పోషిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పిస్తూ, 35 లక్షల మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోందని ఆయన తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందించాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉపాధ్యాయుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించి, వారి హక్కుల సాధనకు కృషి చేసే ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి అర్హుడైన పౌరుడి బాధ్యత అని అన్నారు.

ఈ నేపథ్యంలో అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పట్టభద్రుల ఓటరు నమోదును సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు జాబితాలో తమ పేర్లు, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని డా. మిర్యాల దుర్గాప్రసాద్ కోరారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news