రామన్నపేట, అక్టోబర్ 26 (స్థానికం ప్రతినిధి):
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రామన్నపేటలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు సహాయ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించి నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించి, ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తరఫున సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్, నాయకులు జినుకల ప్రభాకర్,నంద్యాల బిక్షం రెడ్డి, గుత్తా నరసింహారెడ్డి,వనం చంద్రశేఖర్, జెల్లా వెంకటేశం,రాయిని రమేష్,బొడ్డు సాలయ్య, గోదాసు శ్రీమన్నారాయణ,బత్తుల కృష్ణ, కందిమల్ల గోపాల్ రెడ్డి, కొమ్ము శేఖర్,నారపాక యాదయ్య,కొండ బుచ్చిబాబు గౌడ్ ,సాల్వేర్ అశోక్, ఎండి జమురుద్దీన్, ఎండి అక్రమ్, పెద్దగోని వెంకటేశం, అయ్యాడపు నర్సిరెడ్డి, శంబాల వెంకటేశం, కోట సుధాకర్, ఎర్ర శేఖర్, మోటే రమేష్, నారపాక అశోక్,కేశ కిరణ్,అబ్దుల్ వహీద్ అంజాద్, ఎటేల్లి పరమేష్, నోముల ప్రవీణ్, లేంకల ప్రవీణ్ వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. .
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి