Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

బోరంచలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. సీసీ రోడ్డు, స్నాన ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Updated : 26 Oct 2026 17:14 IST
As Preferred Source 1 min read
బోరంచలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. సీసీ రోడ్డు, స్నాన ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా మానూర్ మండలం బోరంచ గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించిన సీసీ రోడ్డును, మాఘ అమావాస్య సందర్భంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్నాన ఘాట్‌ను నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం సింగూరు నీటిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మాఘ అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల రాకపోకలు సులభతరం కావడానికి సీసీ రోడ్డు నిర్మాణం, పుణ్యస్నానాల కోసం ప్రత్యేక స్నాన ఘాట్ ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. భక్తులకు, గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, యువ నాయకుడు పట్లోళ్ల లోకేష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ గ్రామ వార్డు మెంబర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బోరంచ గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. సీసీ రోడ్డు, స్నాన ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news