Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రామన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తెల్సూరి మల్లేశంను సత్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం.

Updated : 26 Oct 2026 17:10 IST
As Preferred Source 1 min read
రామన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తెల్సూరి మల్లేశంను సత్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం.

జర్నలిస్టుల ఐక్యతకు గుర్తింపుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి సన్మానం!

రామన్నపేట ప్రెస్ క్లబ్‌కు రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రామన్నపేటలో నూతనంగా పునరుద్ధరించబడిన రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తెల్సూరి మల్లేశం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తెల్సూరి మల్లేశంను ఎమ్మెల్యే సత్కరించడం ప్రెస్ క్లబ్ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపింది. జర్నలిస్టుల ఐక్యతను చాటుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రెస్ క్లబ్ కీలక పాత్ర పోషించాలనే ఆకాంక్ష ఈ సందర్భంగా వ్యక్తమైంది.రామన్నపేటలో రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్ పునరుద్ధరణతో జర్నలిస్టుల సంఘటిత కార్యాచరణకు మరింత బలం చేకూరుతుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు డా,కొండ మల్లేశం గౌడ్, బత్తుల గణేష్, సిర మహేష్, నాగటి యాదయ్య, కేవీఎస్ రాజు, నోముల శంకర్, వీరమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తెల్సూరి మల్లేశంను సత్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం.

Article Image

జర్నలిస్టుల ఐక్యతకు గుర్తింపుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి సన్మానం!

రామన్నపేట ప్రెస్ క్లబ్‌కు రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రామన్నపేటలో నూతనంగా పునరుద్ధరించబడిన రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తెల్సూరి మల్లేశం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తెల్సూరి మల్లేశంను ఎమ్మెల్యే సత్కరించడం ప్రెస్ క్లబ్ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపింది. జర్నలిస్టుల ఐక్యతను చాటుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రెస్ క్లబ్ కీలక పాత్ర పోషించాలనే ఆకాంక్ష ఈ సందర్భంగా వ్యక్తమైంది.రామన్నపేటలో రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్ పునరుద్ధరణతో జర్నలిస్టుల సంఘటిత కార్యాచరణకు మరింత బలం చేకూరుతుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు డా,కొండ మల్లేశం గౌడ్, బత్తుల గణేష్, సిర మహేష్, నాగటి యాదయ్య, కేవీఎస్ రాజు, నోముల శంకర్, వీరమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news