Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: రాష్ట్ర నోడల్ అధికారి విద్యాసాగర్

Updated : 26 Oct 2026 16:52 IST
As Preferred Source 1 min read
పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: రాష్ట్ర నోడల్ అధికారి విద్యాసాగర్

తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్ఆకస్మిక తనిఖీ నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ దరఖాస్తుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సమర్పించే వినతుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సమీక్షలో సూచించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రజావాణి నోడల్ అధికారి బి. లాజర్, తహసీల్దార్ వినోద్ కుమార్, ఎంపీఓ భీమ్ సింగ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news