అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌పై ఐజీపి ఉత్తర్వులు జారీ
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ పోలీస్ సబ్‌డివిజన్‌లో ఇద్దరు సీఐలను బదిలీ చేస్తూ హైదరాబాద్ మల్టీ జోన్-II ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాల (Administrative Grounds) రీత్యా ఈ బదిలీలు చేపడుతున్నట్లు మల్టీ జోన్-II ఆర్డర్ (M.Z.O.No. 422/2026)లో పేర్కొన్నారు.
డి. సతీష్ రెడ్డి: ఇప్పటివరకు చౌటుప్పల్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈయనను చౌటుప్పల్ టౌన్ సీఐగా బదిలీ చేశారు.
జి. మన్మథ కుమార్: చౌటుప్పల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఈయనను చౌటుప్పల్ రూరల్ సర్కిల్ సీఐగా నియమించారు.
ఈ మేరకు మల్టీ జోన్-II పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు (PEB) నూతన నియామకాలకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఆమోదించింది. ఇద్దరు అధికారులను తక్షణమే రిలీవ్ చేసి, కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించేలా తగిన చర్యలు తీసుకోవాలని, రిలీవింగ్, జాయినింగ్ తేదీలను ఐజీ ఆఫీస్‌కు నివేదించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీని ఆదేశించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి