మంగళగిరి పట్టణంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి పట్టణ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నందేటి ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నందేటి ప్రభాకర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం జీవించాలని, భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ సంయుక్త కార్యదర్శి ఈపూరి ఆదాము, గుంటూరు జిల్లా మహిళా విభాగం కార్యకర్త మల్లవరపు సుధారాణి, పట్టణ కార్యవర్గ సభ్యుడు భూద్దుల దామోదర్, వార్డు ఎస్సీ సెల్ సభ్యుడు సీహెచ్ రాజు, కాజా గ్రామ ప్రధాన కార్యదర్శి పిల్లి భూషణం తదితరులు పాల్గొని ప్రభాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి