Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా

Updated : 26 Oct 2026 12:07 IST
As Preferred Source 1 min read
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా

ప్రజల తాగునీటి అవసరాలపై ముందస్తు ప్రణాళిక ఏది

భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ డా. కె. రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట: అక్టోబర్, 26

నారాయణపేట: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ డా. కె. రాజ్ కుమార్ రెడ్డి కోరారు.

వర్షపాతం తగ్గే పరిస్థితులు ఏర్పడితే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు, రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది? నీటి ఎద్దడి ఏర్పడే గ్రామాలను గుర్తించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? అని ఆయన ప్రశ్నించారు.

ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా ట్యాంకర్ల ఏర్పాటు, నీటి వనరుల పరిరక్షణ, వర్షపు నీటి నిల్వకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగానికి అవసరమైన ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కోరారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, నీటి సంరక్షణకు ప్రభుత్వం తగిన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

ప్రజలకు భరోసా కల్పించడం, నీటి సమస్యలను ముందుగానే పరిష్కరించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని డా. రాజ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని భీష్మ రాజ్ ఫౌండేషన్ తరఫున ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news