Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

గ్రామ ప్రజల కోరిక మేరకు అయ్యప్ప ఆలయానికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ రూ.2 లక్షల విరాళం

Updated : 26 Oct 2026 15:48 IST
As Preferred Source 1 min read
గ్రామ ప్రజల కోరిక మేరకు అయ్యప్ప ఆలయానికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ రూ.2 లక్షల విరాళం

సిర్గాపూర్ మండల పరిధిలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం కోసం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ రూ.2 లక్షల విరాళాన్ని అందించారు. గ్రామ ప్రజల కోరిక మేరకు ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించి భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గుఱ్ఱపు మచ్చేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ బసవరాజు పటేల్, సంజురావు పటేల్, అంజ గౌడ్, సాయిలు, కిరణ్ రావు పటేల్, కృష్ణ డాక్టర్, పుండరికం, సంగమేష్, నామ్దేవ్, చిన్న నారాయణ సెట్, చాకలి సాయిలు, నరేష్ సెట్, హన్మండ్లు, నరేష్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ ప్రజల కోరిక మేరకు అయ్యప్ప ఆలయానికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ రూ.2 లక్షల విరాళం

Article Image

సిర్గాపూర్ మండల పరిధిలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం కోసం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ రూ.2 లక్షల విరాళాన్ని అందించారు. గ్రామ ప్రజల కోరిక మేరకు ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించి భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గుఱ్ఱపు మచ్చేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ బసవరాజు పటేల్, సంజురావు పటేల్, అంజ గౌడ్, సాయిలు, కిరణ్ రావు పటేల్, కృష్ణ డాక్టర్, పుండరికం, సంగమేష్, నామ్దేవ్, చిన్న నారాయణ సెట్, చాకలి సాయిలు, నరేష్ సెట్, హన్మండ్లు, నరేష్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news