Sthanikam - Truth Matters
Logo

కడవరకు కమ్యూనిస్టుగా.. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా!

Updated : 26 Oct 2026 13:32 IST
As Preferred Source 1 min read
కడవరకు కమ్యూనిస్టుగా.. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా!

రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి జిట్ట నర్సింహా విశేష కృషి.

చిట్యాల: పేద కుటుంబంలో జన్మించి, జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన సీపీఎం సీనియర్ సభ్యుడు కామ్రేడ్ జిట్ట నర్సింహా (75) సేవలు చిరస్మరణీయమని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు కొనియాడారు. చిట్యాల పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన నర్సింహా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న చెరుపల్లి సీతారాములు సోమవారం నర్సింహా నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. సీపీఎం తరఫున సింగిల్ విండో డైరెక్టర్‌గా ఎన్నికైన జిట్ట నర్సింహా రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ అభివృద్ధికి, ప్రజా ఉద్యమాల బలోపేతానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన నర్సింహా మరణం పార్టీకి తీరని లోటని అన్నారు.

Sthanikam

కడవరకు కమ్యూనిస్టుగా.. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news