బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలకు పంచామృతాభిషేకం.. భక్తులకు ఈశ్వరుడి దివ్య దర్శనం
పౌర్ణమి, సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మక శివాలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలోని బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలకు తెల్లవారుజామున వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలతో విశేష రుద్రాభిషేకం నిర్వహించారు.
అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలతో అలంకరణ చేసి, పుష్పార్చన, బిల్వార్చన, నీరాజనం, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. పౌర్ణమి, సోమవారం కలిసివచ్చిన శుభవేళలో పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. పూజల అనంతరం భక్తులకు ఈశ్వరుడి దివ్య దర్శనం కల్పించారు.
చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పిల్లలమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో పులకించాయి. భక్తులు భక్తిపారవశ్యంతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి