ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కందుల హనుమంతు, కార్యదర్శి మేడి ముకుంద్ ఆరోపించారు. ఈ నెల 6న హైదరాబాద్‌లోని ఉపాధి హామీ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం నిర్వహించిన సంఘం మండల కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధుల వాటాతో పాటు పలు కొర్రీలు పెడుతోందని ఆరోపించారు. దీంతో పేదలకు ఉపాధి అవకాశాలు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పేదల కడుపుకొట్టి పెద్దలకు దోచిపెట్టే విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ధర్నాను విజయవంతం చేసేందుకు వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో మండల కమిటీ సభ్యులు భావనగంటి నాగేష్, వల్లమల్ల నరసింహ, కొమ్ము అంజయ్య, బొడిగ రజిత, రవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి