Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంచరకుంట్ల కాలనీ కమ్యూనిటీ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 06:35 PM

ఉపాధ్యాయులకు ‘ఆచార్య దేవోభవ’ అవార్డులు ప్రైవేటు టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి. చేస్తా: విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య..

07-10-2026 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, అక్టోబర్‌ 7 స్థానికం ప్రతినిధి:

తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ (ట్రస్మా) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు ‘ఆచార్య దేవోభవ–2026’ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు సాధుల మధుసూదన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రైవేట్‌ టీచర్ల రక్షణ చట్టం అమలుకు కృషి చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌రావు, రాష్ట్ర సలహాదారు కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు బండిరాజుల శంకర్, ప్రధాన కార్యదర్శి సయ్యద్, కోశాధికారి మరియన్న, మాజీ జిల్లా అధ్యక్షులు అచ్చయగౌడ్, దణాప్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రామిరెడ్డి, జిల్లా నాయకుడు ఉపేందర్‌రెడ్డి, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధ్యాయులకు ‘ఆచార్య దేవోభవ’ అవార్డులు ప్రైవేటు టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి. చేస్తా: విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య..

Article Image

యాదగిరిగుట్ట, అక్టోబర్‌ 7 స్థానికం ప్రతినిధి:

తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ (ట్రస్మా) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు ‘ఆచార్య దేవోభవ–2026’ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు సాధుల మధుసూదన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రైవేట్‌ టీచర్ల రక్షణ చట్టం అమలుకు కృషి చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌రావు, రాష్ట్ర సలహాదారు కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు బండిరాజుల శంకర్, ప్రధాన కార్యదర్శి సయ్యద్, కోశాధికారి మరియన్న, మాజీ జిల్లా అధ్యక్షులు అచ్చయగౌడ్, దణాప్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రామిరెడ్డి, జిల్లా నాయకుడు ఉపేందర్‌రెడ్డి, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News