Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంచరకుంట్ల కాలనీ కమ్యూనిటీ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 06:37 PM

తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం.

తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం.

తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం.
07-10-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిస్సింగ్‌ కేసులో ఉన్న మహిళగా గుర్తింపు.. హత్యపై కుటుంబ సభ్యుల అనుమానం.

: నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం లభించడం కలకలం రేపింది. బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన వారు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరించారు.మృతురాలిని మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగ (46)గా గుర్తించారు. సెప్టెంబర్‌ 28న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మంగ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఓయూ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ ఫిర్యాదు చేశారు. తాజాగా తట్టి అన్నారం సమీపంలో లభించిన మృతదేహం మంగదేనని పోలీసులు నిర్ధారించారు.కాగా, తన తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయని మంగ కుమార్తె జ్యోతి పోలీసులకు తెలిపింది. మిస్సింగ్‌ ఫిర్యాదు సమయంలోనే కొందరిపై అనుమానం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. మృతదేహం వద్ద మద్యం సీసాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.అయితే మంగ హత్యకు గురైనట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని ఇన్‌చార్జి ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. మృతికి అసలు కారణం తేల్చేందుకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాగోల్‌ ఇన్‌స్పెక్టర్‌ మక్బూల్‌ జానీ ఆధ్వర్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News