Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తైక్వాండోలో గ్రీన్‌గ్రోవ్ విద్యార్థుల సత్తా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 05:45 PM

తైక్వాండోలో గ్రీన్‌గ్రోవ్ విద్యార్థుల సత్తా

06-10-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జిల్లాస్థాయి పోటీల్లో ఏడు పతకాలు కైవసం.

జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్‌గ్రోవ్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ యునైటెడ్ నల్గొండ డిస్ట్రిక్ట్ క్యూరుగీ అండ్ పూమ్సే ఛాంపియన్‌షిప్‌లో పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు వివిధ విభాగాల్లో పతకాలు సాధించారు.అండర్‌-14 బాలుర విభాగంలో ఏడో తరగతి విద్యార్థి రాధారపు ప్రణయ్ మణిదీప్ బంగారు పతకం సాధించగా, బొక్క శ్రీ విష్ణువర్ధన్, ఇల్లందుల విఘ్నేష్ వెండి పతకాలు కైవసం చేసుకున్నారు. బొక్క శ్రీ హర్షవర్ధన్ రెడ్డి కాంస్య పతకం సాధించాడు. బాలికల విభాగంలో నాలం లోచన అనన్య, జిట్ట మిథిలా వెండి పతకాలు, బత్తుల వేదాన్‌షిత కాంస్య పతకం సాధించారు.

పతకాలు సాధించిన విద్యార్థులను చిట్యాల ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్‌రెడ్డి అభినందించి పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. చిన్నతనం నుంచే తైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఏకాగ్రత పెంపొందుతాయని అన్నారు. ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకునే సామర్థ్యం ఆత్మరక్షణ విద్యలతో సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

జిల్లాస్థాయిలో గ్రీన్‌గ్రోవ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ జాన్‌రెడ్డి, తైక్వాండో మాస్టర్ పట్టేడ సుధాకర్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తైక్వాండోలో గ్రీన్‌గ్రోవ్ విద్యార్థుల సత్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News