సూర్యాపేట జిల్లాలో కలకలం.. మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు.
స్థానికం | సూర్యాపేట: ఆత్మకూర్ ఎస్ మండలం బోడ తండాలో ప్రణీత (17) అనే బాలిక మృతదేహం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో లభ్యమైంది. మృతదేహంపై కాలిన గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రణీత మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఓ యువకుడు తన వెంటపడుతున్నాడని ఆరోపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి