మానూర్ మండలం తోర్నల్ గ్రామం మీదుగా కర్ణాటక వైపు వెళ్తున్న సోలార్ విద్యుత్‌కు సంబంధించిన 750 కేవీ కలెక్షన్ లైన్ కారణంగా గ్రామంలో అర్థింగ్ (హమ్మింగ్) సమస్య ఏర్పడుతోందని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి గ్రామ ప్రజలు, రైతుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ పి. సంగమేశ్వర పాటిల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం మానూర్ డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కలెక్షన్ లైన్ గ్రామ పరిధి మీదుగా వెళ్లడం వల్ల విద్యుత్ స్తంభాలు, వ్యవసాయ పొలాల వద్ద అర్థింగ్ సమస్య ఏర్పడుతోందని, దీంతో విద్యుత్ స్తంభాల వద్ద పనిచేసే సిబ్బందితో పాటు పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకునే రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి సమస్యను సాంకేతికంగా పరిశీలించి, అర్థింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలాగే విద్యుత్ స్తంభాలు, వ్యవసాయ పొలాల వద్ద అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని డిప్యూటీ కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జి. సంజీవ్ కుమార్, రాహుల్ పటేల్, ఖాలేద్, మారుతి, కలప్ప, సతీష్, శ్రీపాల్ రెడ్డి, సంతోష్ రెడ్డి, గణపతి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
సోలార్ విద్యుత్ లైన్‌తో అర్థింగ్ సమస్య.. అధికారులకు వినతి

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి