Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
షీ టీమ్ ఆధ్వర్యంలో బాలల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 06:39 PM

సంతోషిమాత ఆలయంలో దాడి ఘటనపై ఈటల ఆరా

సంతోషిమాత ఆలయంలో దాడి ఘటనపై ఈటల ఆరా

సంతోషిమాత ఆలయంలో దాడి ఘటనపై ఈటల ఆరా
03-10-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దిల్‌సుఖ్‌నగర్‌: చైతన్యపురి డివిజన్‌ పరిధిలోని భవానీనగర్‌ కాలనీలో ఉన్న శ్రీ సంతోషిమాత ఆలయాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ శుక్రవారం సందర్శించారు. ఇటీవల అమ్మవారి విగ్రహంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఆలయ అర్చకులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట గడ్డిఅన్నారం డివిజన్‌ తాజా మాజీ బీజేపీ కార్పొరేటర్‌ బద్దం ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. సంతోషిమాత ఆలయంలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. అర్చకులు, భక్తుల సమక్షంలో గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహంపై దాడికి పాల్పడటం గర్హనీయమన్నారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దేవాలయాల భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

బద్దం ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్‌ స్పందించి ఆలయాన్ని సందర్శించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ అర్చకులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

సంతోషిమాత ఆలయంలో దాడి ఘటనపై ఈటల ఆరా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News