Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
షీ టీమ్ ఆధ్వర్యంలో బాలల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 06:39 PM

షీ టీమ్ ఆధ్వర్యంలో బాలల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

03-10-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం సంగారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డివిజన్ షీ టీమ్ ఇన్‌చార్జి ఏఎస్ఐ తులసిరాం విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు షీ టీమ్ నిరంతరం పనిచేస్తోందని, మహిళల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, పని ప్రదేశాల్లో వేధింపులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఫేక్ ఖాతాలు, ఆన్‌లైన్ మోసాలు,సామాజిక మాధ్యమాల దుర్వినియోగం,సైబర్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసర సమయంలో 100, 112, సైబర్ నేరాల కోసం 1930, బాలల సహాయం కోసం 1098, సంగారెడ్డి షీ టీమ్ కోసం 8712656772 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుల్ చాంగుబాయి, పోలీస్ మహిళా పోలీస్ సిబ్బంది లత,బాలల సంక్షేమ కమిటీ శాఖ నర్సిములు, కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసన్న, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలు, బాలల భద్రతతో పాటు సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

షీ టీమ్ ఆధ్వర్యంలో బాలల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News