నవంబర్ 23న మహోత్సవం.. త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ.
భువనగిరి, నవంబర్ 1: స్థానికం ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం పరిధిలోని శ్రీగిరి శ్రీ యాదాద్రి అష్టలక్ష్మి దేవాలయంలో ఈ నెల 23న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ కరకమలాల మీదుగా అష్టలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
అష్టలక్ష్మి అమ్మవార్ల సన్నిధిలో ఎనిమిది విశేషాలతో ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ వ్యవస్థాపకులు, ఫౌండర్ చైర్మన్ యాద అశోక్ గుప్తా తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించేలా ఆలయ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉపాధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్ల కృపాకటాక్షాలు పొందాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాద అశోక్ గుప్తా కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి