Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

స్వాములవారి లింగోటం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేవెళ్లి శివకృష్ణ

Updated : 21 Nov 2026 19:57 IST
As Preferred Source 1 min read
స్వాములవారి లింగోటం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేవెళ్లి శివకృష్ణ

30 మందితో మూడు బూత్ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

స్వాములవారి లింగోటం గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా చేవెళ్లి శివకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల నాయకుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు, కార్యకర్తల ఏకాభిప్రాయంతో ఆయన్ను ఎన్నుకున్నారు. దీంతో పాటు గ్రామంలోని మూడు పోలింగ్ బూత్‌లకు సంబంధించి మొత్తం 30 మందితో బూత్ కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నూతన కమిటీలు కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతన అధ్యక్షుడు శివకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.​కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య, పార్టీ సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, పీఏసీఎస్ ఛైర్మన్ మస్తాన్‌బాబు, గ్రామ సర్పంచ్ ప్రదీప్‌జీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, అంజయ్య, ఉప్పు భద్రయ్య, బొడిగె ఆనంద్‌గౌడ్, అర్థ వెంకట్‌రెడ్డి, జాల మల్లేష్, శేఖర్‌గౌడ్, గుండు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వాములవారి లింగోటం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేవెళ్లి శివకృష్ణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి