Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలి

Updated : 21 Nov 2026 19:57 IST
As Preferred Source 1 min read
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలి

ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మునగాల గ్రామ మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ నేతృత్వంలో మత్స్యకారులు జెండా ఆవిష్కరించి, అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పిట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నో సవాళ్లను, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ జీవనోపాధి సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. మత్స్యకారులు ఐకమత్యంతో ఉంటూ తమ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం ఉపాధ్యక్షుడు కంటు శ్రీను, సంఘం సభ్యులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలి

Article Image

ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మునగాల గ్రామ మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ నేతృత్వంలో మత్స్యకారులు జెండా ఆవిష్కరించి, అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పిట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నో సవాళ్లను, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ జీవనోపాధి సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. మత్స్యకారులు ఐకమత్యంతో ఉంటూ తమ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం ఉపాధ్యక్షుడు కంటు శ్రీను, సంఘం సభ్యులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి