Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఆరుతడి పంటల సాగుతో అధిక లాభాలు.. రైతులకు కేవీకే శాస్త్రవేత్త సూచనలు

Updated : 21 Nov 2026 19:44 IST
As Preferred Source 1 min read
ఆరుతడి పంటల సాగుతో అధిక లాభాలు.. రైతులకు కేవీకే శాస్త్రవేత్త సూచనలు

రైతులు సంప్రదాయ వరి సాగుతో పాటు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించి పంటల వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త డా. కిరణ్ సూచించారు. శనివారం మునగాల మండలం రేపాల గ్రామ రైతు వేదికలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెసర, మినుము, శనగ, కుసుమ, ఆముదం, నువ్వులు వంటి ఆరుతడి పంటలను నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా సాగు చేయాలని తెలిపారు. సరైన విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, ఎరువుల వినియోగం, కలుపు నివారణ పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. పంట మార్పిడి ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.

మండల వ్యవసాయ అధికారి బి. రాజు మాట్లాడుతూ.. ఈ యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు కొంత విస్తీర్ణంలోనైనా ఆరుతడి పంటలు సాగు చేయాలని కోరారు. పంటల ఎంపిక, విత్తనాల లభ్యత, సాగు విధానాలపై వ్యవసాయ శాఖ నుంచి సాంకేతిక సలహాలు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి బి. నాగు, రేపాల సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ, ఉపసర్పంచ్ తుమ్మ సతీష్, రైతులు ఆదిరెడ్డి, ప్రభాకర్, సారిక రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరుతడి పంటల సాగుతో అధిక లాభాలు.. రైతులకు కేవీకే శాస్త్రవేత్త సూచనలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి