Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

డ్రోన్ సాంకేతికతతో కలుపు మందుల పిచికారీపై రైతులకు అవగాహన

Updated : 21 Nov 2026 19:44 IST
As Preferred Source 1 min read
డ్రోన్ సాంకేతికతతో కలుపు మందుల పిచికారీపై రైతులకు అవగాహన

వేరుశనగ,మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై కేవీకే గడ్డిపల్లి ఆధ్వర్యంలో మునగాల మండలం నర్సింహులగూడెంలో క్షేత్ర పరిశీలన నిర్వహించారు. ఇందులో భాగంగా రైతు బండారి వెంకటేశ్వర్లు వేరుశనగ పొలంలో డ్రోన్ ద్వారా కలుపు మందుల పిచికారీ చేపట్టారు.

ఈ సందర్భంగా ఎంపిక చేసిన ముగ్గురు రైతులకు వేరుశనగలో కలుపు నివారణ మందులను అందజేశారు. అలాగే రైతు షేక్ అన్వర్ మొక్కజొన్న పొలాన్ని సందర్శించి కలుపు నివారణ మందులను పంపిణీ చేశారు. శాస్త్రవేత్త అరిగెల కిరణ్ మాట్లాడుతూ.. సరైన మోతాదులో, తగిన పంట దశలో మందులను పిచికారీ చేయడం వల్ల కలుపు నివారణతో పాటు పంట ఎదుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. రాజు, ఏఈవో బి. నాగు, రైతులు వెంకటేశ్వర్లు, అన్వర్, శ్రీనివాస్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డ్రోన్ సాంకేతికతతో కలుపు మందుల పిచికారీపై రైతులకు అవగాహన

Article Image

వేరుశనగ,మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై కేవీకే గడ్డిపల్లి ఆధ్వర్యంలో మునగాల మండలం నర్సింహులగూడెంలో క్షేత్ర పరిశీలన నిర్వహించారు. ఇందులో భాగంగా రైతు బండారి వెంకటేశ్వర్లు వేరుశనగ పొలంలో డ్రోన్ ద్వారా కలుపు మందుల పిచికారీ చేపట్టారు.

ఈ సందర్భంగా ఎంపిక చేసిన ముగ్గురు రైతులకు వేరుశనగలో కలుపు నివారణ మందులను అందజేశారు. అలాగే రైతు షేక్ అన్వర్ మొక్కజొన్న పొలాన్ని సందర్శించి కలుపు నివారణ మందులను పంపిణీ చేశారు. శాస్త్రవేత్త అరిగెల కిరణ్ మాట్లాడుతూ.. సరైన మోతాదులో, తగిన పంట దశలో మందులను పిచికారీ చేయడం వల్ల కలుపు నివారణతో పాటు పంట ఎదుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. రాజు, ఏఈవో బి. నాగు, రైతులు వెంకటేశ్వర్లు, అన్వర్, శ్రీనివాస్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి